‘రైతు డిస్కం’పై ఉన్న అపోహలను తొలగించాలి : సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యుత్ శాఖలో సరఫరా లోపాలను అధిగమించి, మెరుగైన విద్యుత్‌ను సప్లయి చేసేందుకు వీలుగా ఏఐ సాంకేతికతను వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (రైతు డిస్కం)లో చేరికపై ఉద్యోగులు, సిబ్బందికి ఉన్న అపోహలను తొలగించాలని సూచించారు. విద్యుత్ శాఖపై శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్సీఆర్ హెచ్ఆర్డీలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్ లోడ్ పడకుండా చూడాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామికవాడలు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్ వంటి అభివృద్ధి పనుల నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్‌ను సరఫరా చేయాలని ఆదేశించారు. అవసరమైన సబ్స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరారు. గ్రీన్ ఎనర్జీ పాలసీకి సంబంధించి దరఖాస్తులు పెట్టుకున్న ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యతక్రమంలో అనుమతులనివ్వాలని సూచించారు. భారీ డేటా సెంటర్లకు కూడా పర్మిషన్లు ఇవ్వాలన్నారు. సోలార్ పవర్‌పై స్వయం సహాయక సంఘాలకు అవగాహన కల్పించాలని, సబ్స్టేషన్ల పక్కనే ఆయా ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో జిల్లాకు రెండు చొప్పున ప్లాంట్లను నిర్మించాలని ఆదేశించారు. ఇందుకోసం నోడల్ అధికారులను నియమించాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ కృష్ణ భాస్కర్, జెన్కో సీఎమ్‌డీ ఎస్.హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సరఫరాకు ఏఐ సాంకేతికత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



