సంతాపం తెలిపిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ(ఎం-ఎల్) మాస్‌లైన్
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేజీ రామచందర్
నవతెలంగాణ -ఆత్మకూర్
సీపీఐ(ఎం-ఎల్) మాస్‌లైన్ డివిజన్ నాయకులు, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ)జిల్లా అధ్యక్షుడు సామెల్ గత నెల ఏప్రిల్ 30న అనారోగ్యంతో మరణించారు. శుక్రవారం వనపర్తి జిల్లా అమరచింతలో సామేల్ అంతిమయాత్ర జరిగింది. ఇందులో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ(ఎం-ఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేజీ రామచందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నప్పుడే పేదరికంతో కష్టాలు పడినా, కుటుంబం నడవడం ఇబ్బందిగా ఉన్నా అవన్నీ లెక్క చేయకుండా సామేల్ సమాజం మారాలని, అసమానతలు పోవాలనే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీలో చేరి గ్రామంలో జరుగుతున్న అనేక పోరాటాలలో పాల్గొన్నారని కొనియాడారు. సమాజం బాగు కోసం తమ పిల్లలు కూడా తమ వంతు పనిచేయాలనే తపనపడిన వ్యక్తి సామేల్ అని తెలిపారు. దోపిడీ పీడన లేని సమాజం వచ్చినప్పుడే పేదల కష్టాలు పోతాయని అన్నారు. కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు, కే సూర్యం, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మహమాద్ లెవ్యయయల్ రాజు, సత్యబాబు, కే రాజన్న, జిఎస్ గోపి, అజరు, రాజు, రవి, పి.అరుణ్ కుమార్, హనుమంతు,తదితరులు ఉన్నారు.
కార్మిక నేత సామేల్‌కు నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



