సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి
ఇండ్లస్థలాలు ఇవ్వాల్సిందే : టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య
హెచ్‌యూజే-టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు
నవతెలంగాణ -హైదరాబాద్
రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల స్వేచ్ఛ, హక్కుల కోసం ఉద్యమిస్తామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించిన సదుపాయాలను నేటి ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. జర్నలిస్ట్‌ల హక్కులను కాపాడడానికి టీడబ్ల్యూజేఎఫ్ అగ్రభాగాన ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద హెచ్‌యూజే-టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఫెడరేషన్ జెండాను టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి పాత్రికేయుల రెక్కలను కేంద్రం విరిచిందన్నారు. కోడ్‌ల పేరుతో కనీస వేతనాలను అడిగే పరిస్థితి లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కారు కార్మిక వ్యతిరేక వైఖరితో రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ)కు అర్థం లేకుండా పోయిందన్నారు. జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులను జర్నలిస్టులకు కూడా ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల తరపున కంట్రిబ్యూషన్‌ను ప్రభుత్వం చెల్లించాలని కోరారు. హెచ్ యూజే కార్యదర్శి బి జగదీశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిగ రఘు, రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌కె సలీమ, ఈ చంద్రశేఖర్, కే నిరంజన్, హెచ్‌యూజే జాతీయ కౌన్సిల్ సభ్యులు చిట్యాల మధుకర్, హెచ్ యూజే ఆఫీస్ బేరర్లు అచ్చిన ప్రశాంత్, తలారి శ్రీనివాస్‌రావు, ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బి సైదులు, నాయకులు మేకల కృష్ణ, అజరు, లలిత, రాణి, భాస్కర్. శోభ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల స్వేచ్ఛ, హక్కుల కోసం ఉద్యమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



