కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని ప్రగతి సింగారం గ్రామ ఉపసర్పంచ్‌ మోరే శ్రీనివాస్‌, బి ఆర్‌ఎస్‌ నాయకులు భయగాని విక్రమ్‌, పిట్ట సుధాకర్‌, గాదం కొమరయ్య, దుప్పటి సుమన్‌, మాదారపు చిరంజీవి, లోకలబోయిన రాజు, రాము, అశోక్‌, దుర్గారావు, ప్రభాకర్‌, అనిల్‌, సందీప్‌, రవి, రాజయ్యలతోపాటు మరో 20 మంది నాయకులు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీఎస్‌ ఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అధికారం చేపట్టగానే ఆరు గ్యారెంటీ పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. మండలంలోని నేరేడుపల్లి గ్రామంలో జిఎస్‌ఆర్‌ పెద్దకూతురు గండ్ర అశ్విని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో తన తండ్రికి ఎమ్మెల్యేగా ఒకసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి, మాజీ జెడ్పిటిసి చల్లా చక్రపాణి, పరకాల ఏఎంసీ మాజీ చైర్మన్‌ పోలపల్లి శ్రీనివాసరెడ్డి, నాయకులు దుబాసి కష్ణమూర్తి, చిందం రవి, మారపల్లి రవీందర్‌ పాల్గొన్నారు.

Spread the love