– చిరంజీవిని పరామర్శించిన పోతినేని
నవతెలంగాణ – అశ్వారావుపేట
వైద్యులు సూచించినంతకాలం పూర్తి విశ్రాంతి తీసుకుని, చికిత్స పూర్తయ్యాకే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ జిల్లా నాయకులు చిరంజీవికి సూచించారు. గత నెలలో హృద్రోగానికి చికిత్స పొందిన చిరంజీవి ప్రస్తుతం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అశ్వారావుపేటకు వచ్చిన పోతినేని సుదర్శన్ ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలను కచ్చితంగా పాటిస్తూ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాలని సూచించారు. అనంతరం చిరంజీవి కుటుంబ సభ్యులతో కొంతసేపు ఆత్మీయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుల్లయ్య, సత్యనారాయణ, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్, మడిపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
వైద్యుల సలహా తప్పనిసరిగా పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



