Sunday, May 3, 2026
E-PAPER
Homeజిల్లాలువరి కోతలు ఊపందుకున్నా.. కొనుగోలు కేంద్రాలేవీ.?

వరి కోతలు ఊపందుకున్నా.. కొనుగోలు కేంద్రాలేవీ.?

- Advertisement -

– రోడ్లపై ధాన్యం ఆరబోత – వర్షాల భయం, ప్రభుత్వానికి రైతుల విజ్ఞప్తి
నవతెలంగాణ – ఉప్పునుంతల

నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల వ్యాప్తంగా యాసంగి వరి పంట కోతలు జోరుగా సాగుతున్నాయి. పంట కోతకు సిద్ధమై ఉండగా, కొన్ని గ్రామాల్లో పదిరోజుల క్రితమే వరి కోతలు ప్రారంభమయ్యాయి. అయితే వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోసిన వడ్లను భద్రపరచడానికి సరైన గోదాములు లేకపోవడంతో రైతులు ఇళ్ల ముందూ, పొలాల వద్దా, రోడ్లపైనా ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. దీనివల్ల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది.

ఇప్పటికే వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ధాన్యం తడిసి నష్టపోతుందేమోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పెరిగిన పెట్టుబడులు, కూలీల ఖర్చులు రైతులపై భారంగా మారగా, కొనుగోలు కేంద్రాల లేమి మరింత కష్టాలను తెచ్చిపెడుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. రైతుల సమస్యలను గుర్తించి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

యాసంగి వరి కోతలు జరుగుతున్నా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు వడ్లను రోడ్లపై, పొలాల్లో ఆరబోస్తూ ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడితే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. – సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతల నాగరాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -