– సీసీ రోడ్ల కోసం రూ.30 లక్షల నిధులు విడుదల
మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన యూత్ కాంగ్రెస్ నాయకులు మొగిలి రాజ్ కుమార్ యాదవ్
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రేగులగూడెం, గోపాలపూర్, దేవరాంపల్లి, బూడిదపల్లి గ్రామాలకు అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. ఈ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం సీఆర్‌ఆర్ నిధుల నుండి రూ.30 లక్షల గ్రాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులను విడుదల చేసిన రాష్ట్ర మంత్రి గౌరవ శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, అలాగే పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు గారికి రేగులగూడెం గ్రామపంచాయతీ ప్రజల తరఫున యూత్ కాంగ్రెస్ నాయకులు మొగిలి రాజ్ కుమార్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు కూడా తగ్గనున్నాయని తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



