Tuesday, May 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలోతుకెళ్తున్న ఊట

లోతుకెళ్తున్న ఊట

- Advertisement -

వేగంగా తగ్గుతున్న భూగర్భ జలమట్టం
నెలకు మీటర్‌ లోతుకు అడుగంటుతున్న బోర్లు, బావులు
ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ మరింత లోతుకు..
1771 ఫీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల అంచనా

నవతెలంగాణ -ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. కొన్నిచోట్ల మరింత లోతుకు వెళ్తున్నాయి. ఎండల తీవ్రత 45 డిగ్రీలకు చేరుకోవడంతో అంతే వేగంగా భూగర్భ జలమట్టం తగ్గుతోంది. ప్రతి నెలా సగటున మీటరు లోతుకు నీళ్లు తగ్గుతున్నాయి. కొన్ని చోట్ల నీటిమట్టం పూర్తిగా లోతులోకి చేరుకోగా, మరి కొన్ని చోట్ల కొంత నిలకడగా ఉంది. 2026 మే నెల నాటి గణాంకాల ప్రకారం రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితి గత ఏడాదితో పోలిస్తే మెరుగ్గా ఉంది. వర్షపాతం, నీటి సంరక్షణ చర్యల కారణంగా గతేడాది కన్నా కొంత పర్వాలేదు. రాష్ట్ర సాధారణ వర్షపాతం 851 మిల్లీమీటర్లు కాగా గతేడాది జూన్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 1,178 మి.మీ. (37శాతం ఎక్కువ) నమోదైంది. కానీ ప్రస్తుతం వేగంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం కొన్ని జిల్లాల్లో ఆందోళ నకరంగా, ఏప్రిల్‌ నెలాఖరుకు సుమారు 7-8 లోతుకు పడిపోయింది. వికా రాబాద్‌ జిల్లాలో దాదాపు 12-14 మీటర్లు, కరీంనగర్‌, ములుగు వంటి జిల్లాల్లో నీటిమట్టం భారీగా పడిపోగా, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. భూగర్భజల శాఖ 1,771 పీజోమీటర్ల ద్వారా ప్రతి నెలా నీటిమట్టాలను పర్యవేక్షిస్తోంది.

నెలనెలా మీటర్‌ లోతుకు..
వర్షాలు పూర్తిగా తగ్గిపోవడంతో భూమిలోకి నీరు ఇంకే శాతం తగ్గింది. రాష్ట్ర సగటు భూగర్భజల మట్టం నెలకు దాదాపు మీటరు వరకు తగ్గుతోంది. 2025 డిసెంబరులో 5.30 మీటర్లు ఉండగా ఈ ఏడాది జనవరిలో 6.27 మీటర్లుగా నమోదైంది. ఈ రెండు నెలల మధ్య నీటిమట్టాన్ని పోల్చితే 0.97 మీటర్లు పడిపోగా.. అంతకు ముందు నవంబరు, డిసెంబరు నెలల మధ్య పోల్చితే 0.89 మీటర్లు తగ్గింది. ఇది సాధారణమైనప్పటికీ యాసంగి వినియోగం, వేసవికాలం వల్ల మరింత లోతుకు నీరు వెళ్లాయి. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ నీటి వనరులు అడుగంటడం, బోర్లపై ఆధారపడటం పెరుగుతుంది. రానున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వినియోగించాలని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈసారి భారీ వర్షాలతో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.

వికారాబాద్‌లో మరింత క్షీణత
రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరిలో ఖమ్మంలో నీటిమట్టం ఉపరితలం నుంచి 3.50 మీటర్లలో ఉండగా.. వికారాబాద్‌ జిల్లాలో అత్యంత లోతులో 9.82 మీటర్ల వద్ద ఉంది. 12 జిల్లాల్లో ఐదు మీటర్లపైన, 21 జిల్లాల్లో 5-10 మీటర్ల మధ్య ఉంది.

కొన్నిచోట్ల ఆందోళనకరం

సగటున పెరుగుదల ఉన్నప్పటికీ, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు 1.68 మీటర్ల నుంచి 28.01 మీటర్ల లోతు (సగటున 10.10 మీటర్లు) మధ్య ఉన్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 70శాతం కంటే ఎక్కువ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అస్థిరంగా (అధికంగా తోడటం వల్ల) ఉన్నాయి. కొన్ని మండలాలు భూగర్భ జలాలను 100 శాతం నుంచి 177 శాతం వరకు ఎక్కువగా వినియోగిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో భూగర్భ జలాల వెలికితీత వార్షిక రీఛార్జ్‌ కంటే ఎక్కువగా ఉండి, ఆందోళనకరంగా ఉంది.

సగటున 10 మీటర్ల లోతులో నీరు..
రాష్ట్రంలో ప్రస్తుతం సగటున 10 మీటర్ల లోతులో నీటిమట్టం ఉన్నట్టు భూగర్భ జలశాఖ గుర్తించింది. ఫిబ్రవరిలో సగటు నీటిమట్టం 7 మీటర్ల లోతులో ఉంది. గడిచిన రెండు నెలల్లోనే మరో మూడు మీటర్ల లోతుకు చేరుకు న్నాయి. ఎండల తీవ్రతతో వాగులు, వంకలు వట్టిపోతు న్నాయి. కొన్ని ప్రాంతాల్లో తాగు నీటి సమస్య మొదలైంది. భూగర్భజల నీటిమట్టం మార్చిలో 8 మీటర్లు ఉంటే ఏప్రిల్లో 9 మీటర్ల లోతులోకి నీళ్లు చేరాయి. ఆయా జిల్లాల్లో ఫీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల పరిస్థితు లను అంచనా వేస్తున్నారు. కొన్నిచోట్ల 15 మీటర్ల లోతులో, మరికొన్ని చోట్ల 10 మీటర్లు ఆపైన లోతులో నీటమట్టం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొంత నిలకడగా నీటిమట్టం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -