Tuesday, May 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంధాన్యం సేకరణలో వేగం పెంచండి

ధాన్యం సేకరణలో వేగం పెంచండి

- Advertisement -

వానలు కురిసే అవకాశం : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం సేకరణలో వేగం పెంచాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే 14.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ ల్యాండ్‌ మార్క్‌ దాటినట్టు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని కలెక్టర్లు, అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొనుగోలు ద్వారా 1.84 లక్షల మంది రైతుల నుంచి సేకరించామని చెప్పారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ. 2001.96 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. సేకరించిన ధాన్యాన్ని త్వరగా గోదాములకు, ఇతర చోట్లకు పంపించాలని ఆదేశించారు. లేకపోతే వానలకు పంట పాడై రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటికే చాలా చోట్ల వానలు పడి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -