Tuesday, May 5, 2026
E-PAPER
Homeజాతీయంఇండిగో విమానంలో పేలిన ప‌వ‌ర్ బ్యాంక్

ఇండిగో విమానంలో పేలిన ప‌వ‌ర్ బ్యాంక్

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్ర‌మాదం త‌ప్పింది. పవర్ బ్యాంక్ పేలటం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో.. ముందస్తు ప్రమాదాన్ని గుర్తించి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించి ఖాళీ చేయించారు. మంగ‌ళ‌వారం హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లిన విమానంలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. విమానంలో ఉన్న సిబంది వెంటనే విమానాన్ని ఖాళీ చేయించారు. ఛండీగఢ్ విమానాశ్రయంలో ప్రయాణీకులను క్యాబిన్ నుంచి టెర్మినల్ కు తరలించారు. పవర్ బ్యాంక్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ప్యాసెంజర్లు తెలిపారు. క్యాబిన్ అంతా పొగతో కమ్ముకుపోయినట్లు చెప్పారు. ఐదు మంది ప్యాసెంజర్ గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -