నవతెలంగాణ-కుభీర్
మండల పరిధిలోని గ్రామాలలో 65 ఎకరాలలో వేసిన మొక్కజొన్న , జొన్న పంటలు షార్ట్ సర్క్యూట్ తో దగ్గమైన విషయం పాఠకులకు విదితమే. ఈ క్రమంలో మంగళవారం మండల తహశీల్దార్ శ్రీదేవికి బిజెపి కిసాన్ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు ఏషాల దత్తు శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. మండలంలోని ఫార్డి కే, నిగ్వ, దార్ కుభీర్, రంజిని, తో పాటు ఆయా గ్రామాల్లో ఉన్న 65 ఎకరాల మొక్కజొన్న జొన్న పంటలు కారిపోవడంతో దాదాపు 50 లక్షలు నష్టం వాటిల్లినట్లు వారు తెలిపారు. దీంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష చొప్పున నష్టపరిహారం అందించేలా చూడాలన్నారు. అదేవిధంగా గతంలో వడగండ్ల వాన, భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు అతివృష్టి వల్ల జరిగిన నష్టాన్ని ఇప్పటివరకు అందలేదని తెలిపారు. దీంతోపాట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏశాల దత్తాత్రి,కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ, గులాబ్ నాయక్, పండిత్ జాదవ్,ప్రవీణ్ కుమార్,సాయినాథ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు నష్టపరిహారం అందించాలని వినతి
- Advertisement -
- Advertisement -



