నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను టీవీకే అధినేత విజయ్ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం తగినంత బలముందని, తమకు అవకాశం ఇవ్వాలని తన పార్టీ అనుచరులతో కలిసి లోక్‌భవన్‌లో గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. మరోవైపు రేపు విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈక్రమంలోనే చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. సోమవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే 107 స్థానాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో ఉన్నది. పలు పార్టీల మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు చేస్తోంది.
రేపు ప్రమాణస్వీకారం..గవర్నర్‌ను కలిసిన విజయ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



