Tuesday, May 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిధులు మంజూరుపై మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు

నిధులు మంజూరుపై మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

పల్లెల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా సీసీ రోడ్లు,సైడ్ డ్రైన్స్ నిర్మాణాల కోసం మంథని నియోజకవర్గానికి రూ.15 కోట్లు, మల్హర్ రావు మండలానికి రూ.1కోటి 60 లక్షల సీఆర్ఆర్ ఎస్సి కంపోనెంట్ నిధులు, అలాగే కళ్యాణ లక్ష్మీ రూ.10 లక్షల చెక్కులను మంజూరు చేయించిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య బుధవారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బడుగు వర్గాల అభివృద్ధికి వారు సమాజంలో గౌరవంగా తలెత్తుకు తిరిగేందుకు మంత్రి శ్రీధర్ బాబు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారనడానికి ఇది నిదర్శనమన్నారు. పేదల అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్న మంత్రికి రాబోవు ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రేస్ పార్టీ పక్షాన నిలబడతారని ఇందుకు మండల ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -