Wednesday, May 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా పంప్ డ్రైవర్ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా పంప్ డ్రైవర్ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు

- Advertisement -

తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి.!
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్ల పంచాయతీ కార్యక్రమంలో ఇరువై ఏళ్లుగా నిజాయితీగా,ఎలాంటి ఆరోపణలు లేకుండా విధులు నిర్వహిస్తున్న పంప్ డ్రైవర్ రామిడి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం గ్రామ సర్పంచ్ బండి స్వామి,పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జునరెడ్డి స్వయంగా జీపీ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడారు ఇరవై ఏళ్లుగా తక్కువ చాలీచాలని వేతనంతో పంప్ డ్రైవర్ గా,ఇంటి పన్ను వసూళ్లలో పాలుపంచుకుంటూ ప్రజల నుంచి ఎలాంటి ఆరోపణలు లేకుండా నిజాయితీకి నిలుటద్దంలా…ప్రజలకు,అధికారులకు,ప్రజాప్రతినిధులకు తలలో నాలుకలా మెదులుతున్నాడని అభినందించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి,స్వీట్స్ పంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.శ్రీనివాస్ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.తాడిచెర్ల పంచాయతీ చరిత్రలో మునుపెన్నడూ పాలకవర్గం కానీ,పంచాయతీ అధికారులు కానీ జీపీ కార్మికులకు పుట్టినరోజు వేడుకలు చేయడం కానరాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -