Thursday, May 7, 2026
E-PAPER
Homeసినిమాదుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు..

దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు..

- Advertisement -

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ – రెండింటిలోనూ కళాకారులకు ప్రాతినిధ్యం వహించే ఏకైక గుర్తింపు పొందిన, అధికారిక సంఘం ‘మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఒక్కటే అని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో అనుబంధంగా ఉంది అని 'మా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కొంతమంది వ్యక్తులు, అనధికార సమూహాలు ‘మాపేరును దుర్వినియోగం చేస్తున్నారు. అలాగే కళాకారుల నుండి చట్టవిరుద్ధంగా డబ్బు వసూలు చేయడానికి 'మా ఏపీ, ‘ఏపీ మావంటి తప్పుదారి పట్టించే శీర్షికలను ఉపయోగించి, గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ఇటీవల మా దృష్టికి వచ్చింది. ' మా ఏపీ, ‘ఏపీ మావంటి సంస్థ 'మా ద్వారా అధికారికంగా గుర్తించబడలేదు. అంతేకాకుండా ‘మాతరపున డబ్బు వసూలు చేయడానికి ఏ వ్యక్తి లేదా సమూహానికి అధికారం ఇవ్వలేదు. ఈ మోసపూరిత కార్యకలాపాలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. 'మా పేరును దుర్వినియోగం చేస్తున్నట్లు లేదా కళాకారులను, ప్రజలను తప్పుదారి పట్టించినట్లు తేలితే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ‘మా` ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -