కథానాయకుడు నితిన్ కొత్త సినిమా ప్రారంభమైంది. సితార ఎంటర్‌టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకులు నారి సిరిసవాడ, సోమశేఖర్ టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా అనిత్ మదాడి, కళా దర్శకుడిగా జానీ షేక్ వ్యవహరిస్తున్నారు. ప్రతిభా వంతులైన సాంకేతిక బృందం తమ నైపుణ్యంతో దృశ్యపరంగా ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. వైవిధ్యమైన కథలతో వరుస విజయాలు సాధిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కావడం, అలాగే నితిన్ కథానాయకుడిగా దర్శక ద్వయం ఈ సినిమాని తెరకెక్కిస్తుండటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ నిర్మాణ సంస్థల కలయికలో ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలు రావడంతో, ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా చిత్రీకరణ మే రెండో వారం నుండి ప్రారంభం కానుంది. చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నద్ధమవుతోంది.ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.నితిన్, రితికా నాయక్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్), సహ నిర్మాతలు: ఉప్పుటూరి వెంకట్, వీఎంఆర్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య.



