Thursday, May 7, 2026
E-PAPER
Homeసినిమావైవిధ్యమైన నేపథ్యంలో 'అమరం

వైవిధ్యమైన నేపథ్యంలో ‘అమరం

- Advertisement -

తేజేష్ రాజన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'అమరం. తిరు అరుల్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజైంది. ఇంటెన్స్ యాక్షన్తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఓ ట్రైబల్ స్మగ్లర్‌, కిల్లర్, ఓ యువతి ప్రయాణం చుట్టూ తిరిగే కథ ఇది. ఎర్రచందనం స్మగ్లర్ల జీవనశైలి, వారు ఎదుర్కొనే కష్టాలు, ప్రమాదాలు, వారి ప్రపంచంలో దాగి ఉన్న వాస్తవాలను కూడా ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. ఈస్ట్రన్ ఘాట్స్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడి సామాజిక సమస్యలను ఎంతో శక్తివంతంగా ప్రజెంట్ చేస్తోంది. వెస్ట్రన్ ఘాట్స్‌లో కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించగా, కడప పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మించారు. దాదాపు 200 మందికి పైగా పాల్గొన్న ప్రత్యేక యాక్షన్ బ్లాక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. బాంబేకు చెందిన మార్షల్ ఆర్ట్స్ టీమ్ సహకారంతో మాస్టర్ మిరాకిల్ మైఖేల్ ఆధ్వర్యంలో మూడు భారీ యాక్షన్ బ్లాక్స్ తెరకెక్కించారు. ఓ భిన్న ప్రేమకథను సిట్యువేషనల్ యాక్షన్‌తో మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించారు. హీరోయిన్‌గా ఐరా అగర్వాల్ నటించారు అని చిత్ర యూనిట్ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -