నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా విజయ్‌కు ఆ రాష్ట్ర పోలీస్ శాఖ భద్రతను పెంచింది. విజయ్ నివాసంతో పాటు టీవీకే కార్యాలయం, అలాగే టీవీకే ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్ వద్ద కూడా భారీ సంఖ్యలో పోలీసులు కనిపించారు.
కాగా, 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీవీకే 107 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అయితే అధికారం చేపట్టడానికి కావాల్సిన 118 సీట్లు రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధం నెలకొంది. ప్రస్తుత ఎన్నికల్లో ఐదు సీట్లు గెలిచిన కాంగ్రెస్.. మద్దతు ప్రకటించినప్పటికి విజయ్‌కు ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. ముందు మ్యాజిక్ ఫిగర్ (118) చూపించాకే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేసుకోవాలని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తేల్చి చెప్పారు. దీంతో విజయ్ ప్రమాణస్వీకారంపై సస్పెన్స్ కొనసాగుతోంది.



