కాంగ్రెస్ లో చేరిన కురుమ సంఘం కుల పెద్ద

నవతెలంగాణ- రామారెడ్డి: మండల కేంద్రానికి చెందిన కురుమ సంఘం కుల పెద్ద చిందం మల్లయ్య బుధవారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పట్ల లక్ష్మీరాజ్యం, సొసైటీ వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని, పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love