- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో గురువారం పెద్దవాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ఇసుక ట్రాక్టర్లను, 2 ఖాళీ ట్రాక్టర్లలు ఎస్ఓటి స్పెషల్ అధికారులు పట్టుకున్న సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టిఎస్ 03 ఈడి 4208, ఏపీ 20 వై 6781, ఏపీ 24 టి ఏ 8714 , టీజీ 29 ఎ 1664, ఏపీ 22 ఏ జె 8977, టీఎస్ 30 టిఎ 0859 నెంబర్లు గల ఇసుక ట్రాక్టర్లు, ఖాళీ ట్రాక్టర్లను ఎస్ఓటి స్పెషల్ అధికారులు పట్టుకొని , ఆలేరు పోలీసులకు అప్పగించినట్లు, ఎస్ ఐ, ఎన్ వినయ్ విలేకరులకు తెలియజేశారు. ఎస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యాలాద్రి పేర్కొన్నారు.
- Advertisement -



