Thursday, May 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి సీతక్కను కలిసిన జుక్కల్ ఎమ్మేల్యే

మంత్రి సీతక్కను కలిసిన జుక్కల్ ఎమ్మేల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
హైదరాబాద్‌లోని ప్రజా భవన్ లో జుక్కల్ నియోజకవర్గాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు జిల్లా ఇంచార్జి, రాష్ట్ర పంచాయితీ రాజ్ & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను కలిసి వివరించారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా, లబ్ధిదారులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, తమ పరిసరాల్లో ఉన్న వనరులను వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పోలీస్ శాఖ, అటవీ శాఖ, పంచాయతీ రాజ్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని వారు కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, వారి అవసరాలను మానవతా దృక్పథంతో చూడాలని కోరారు.

వారి వారి నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగా, వారి సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి గారు హామీ ఇచ్చారు. ప్రజలకు స్వంత ఇంటి కల సాకారం కావాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -