నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని పలు వార్డులలో విద్యుత్ సమస్యలు పేరుకుపోయి ఉండడంతో పలుమార్లు తాసిల్దార్ కు, విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే పాపాన పోవట్లేదు. స్థానికంగా విద్యుత్ స్థంభాలు, వైర్లు చెట్లపై, వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. జుక్కల్ గ్రామ పంచాయితీ పరిధిలో ప్రతి వార్డులో సుమారుగా 3 నుండి 4 విద్యుత్ స్తంభాలు అతి భయంకరంగా, ప్రమాదకరంగా ఉన్నాయి. కొన్ని స్తంభాలు ఎప్పుడు విరిగిపోతాయోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈదురు గాలులకు పెద్ద పెద్ద వర్షాలు పడ్డప్పుడు స్థంభాలు విరిగి ఇండ్లపై పడే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. గ్రామంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. లేని ఎడల కామారెడ్డి జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు.
విద్యుత్ సమస్యలను గాలికి వదిలేసిన అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



