Friday, May 8, 2026
E-PAPER
Homeజాతీయంత‌మిళ‌నాడులో వీడ‌ని ఉత్కంఠ‌..సీపీఐ, సీపీఐ(ఎం) కీల‌క భేటీ

త‌మిళ‌నాడులో వీడ‌ని ఉత్కంఠ‌..సీపీఐ, సీపీఐ(ఎం) కీల‌క భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: త‌మిళ‌నాడులో రాజ‌కీయ ఉత్కంఠ కొన‌సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధిక స్థానాలు సాధించిన ప్ర‌భుత్వ ఏర్పాట‌కు కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్‌(118)కు స్వ‌ల్ప దూరంలో ఉన్న‌ది. ఐదుగురు ఎమ్మెల్యేలున్నా కాంగ్రెస్ టీవీకేకు మ‌ద్ద‌తు ఇచ్చినా స‌రిప‌డ‌ని మెజార్టీ ల‌భించ‌లేదు. ఈక్ర‌మంలోనే సీపీఐ, సీపీఐ(ఎం) కీల‌క సమావేశంలో నిర్వ‌హించారు. చెన్నైలోని పార్టీ కార్యాల‌యంలో ఇరుపార్టీల‌కు చెందిన నేత‌లు స‌మావేశమైయ్యారు. ఈ భేటీతో టీవీకే ప్ర‌భుత్వ ఏర్పాటుకు మ‌ద్ద‌తు ఇచ్చేది లేద‌ని తెల‌నుంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో సీపీఐ, సీపీఐ(ఎం) చెరో రెండు స్థానాలు సాధించాయి. ఇదిలా ఉండ‌గా ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ను టీవీకే అధినేత విజ‌య్ రెండు సార్లు క‌లిశారు. అయినా కానీ విజ‌య్‌కి ఎలాంటి ఊర‌ట ల‌భించ‌లేదు. సంఖ్య బ‌లం నిరూపించుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ స్ప‌ష్టం చేశారు.

కాగా, తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు కూడగట్టేందుకు, టీవీకే ప్రధాన కార్యదర్శి సిటిఆర్ నిర్మల్ కుమార్, పార్టీ నాయకులతో కలిసి గురువారం రాత్రి చెన్నైలోని సీపీఐ కార్యాలయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులతో సమావేశమయ్యారు. అంతకుముందు, గురువారం సీపీఐ (ఎం) నాయకుడు పి.షణ్ముగం మాట్లాడుతూ, తమిళగ వెట్రి కజగం (టివికె) అధినేత విజయ్ నుండి తమ పార్టీకి ఒక లేఖ అందిందని, దానిపై పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -