నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రములోని గ్రామంలో ఉపాధి హామీ పథకంలో నిర్వహిస్తున్న పనులను ఎంపిడిఓ శ్రీనివాస్ శుక్రవారం క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండను దృష్టిలో పెట్టుకొని ఉపాధి కూలీలు ఉదయం త్వరగా పనులకు రావాలని సూచించారు. నిబంధనల అనుసారం కొలతలు ఎఫ్ఏలు ఇచ్చిన విదంగా పనులు నిర్వహించాలని అన్నారు. పని ప్రదేశంలో త్రాగునీరు, హెల్త్ కిట్స్ అందుబాటులో ఉంచుకోవాలి ఎఫ్ఏ , మేట్లను ఆదేశించారు. కొలతల ప్రకారం పనులు చేసినప్పుడే పూర్తిస్థాయిలో కూలీలు లభిస్తాయని అన్నారు. కూలీలు వచ్చిన హాజరు పట్టికని ఒక్కొక్కరిగా హాజరు తీసుకోవడం, పరిశీలించామని చెప్పారు. ఎండ పూట నీడలో ఉండాలని వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతోపాటు, ఎంపీ ఓ రాము, జిపి కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి పనులను పరిశీలిస్తున్న ఎంపీడీవో శ్రీనివాస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



