Saturday, July 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదవీ బాధ్యతలు చేపట్టిన పీఎసీఎస్ పాలకవర్గం 

పదవీ బాధ్యతలు చేపట్టిన పీఎసీఎస్ పాలకవర్గం 

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం పీఏసీఎస్ పాలకవర్గం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం కార్యాలయంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు పోలే శ్రీధర్ భాస్కర్ రెడ్డి, నరసింహ, మల్లయ్య, రాములు, పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా  సివో బాల్ రెడ్డి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమంతో పాటు సొసైటీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని  పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలను దళారులకు అమ్ముకుంటే నష్టపోతారని  తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -