తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించాలని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య అన్నారు. శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలో రుద్రారం, దుబ్బపేట గ్రామాల్లో వరిధాన్య కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి గ్రామ సర్పంచ్లు చంద్రగిరి సంపత్, కొండ రాజమ్మ, రవిందర్ నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరను పొందాలని కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య,ఉప సర్పంచ్లు,పిఏసిఎస్ డైరెక్టర్లు,కాంగ్రెస్ నాయకులు,సిఈఓ సంతోష్, రైతులు, హమాలీలు,పిఎసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
రైతులు దళారులను ఆశ్రయించొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



