Saturday, May 9, 2026
E-PAPER
Homeఆటలుఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో ఫేక్ టికెట్లు..

ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో ఫేక్ టికెట్లు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్‌ల నిర్వహణ ఉత్సాహంగా సాగుతుండగా, మరోవైపు కొందరు కేటుగాళ్లు టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. లక్నోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో నకిలీ ఐపీఎల్ టికెట్లు తయారు చేసి అమ్ముతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య గురువారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకనా స్టేడియం సమీపంలో నకిలీ టికెట్లు అమ్ముతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్నో సౌత్ డీసీపీ అమిత్ కుమార్ ఆనంద్ మాట్లాడుతూ.. నిందితులు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన వారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -