- Advertisement -
నవతెలంగాణ – బచ్చన్నపేట: అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందిన వృద్ధ దంపతులు పురుగుల మందు సేవించి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన మండలంలోని దబగుంటపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం .. దబగుంటపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు కందుల ఉప్పలవ్వ (65) శంకరయ్య (70) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు.. కాగా జరిగిన సంఘటనపై ఎస్ ఐ ఎస్ కే హమీద్ కేసు దర్యాప్తు చేసుకున్నట్లు వెల్లడించారు.
- Advertisement -



