- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని వార్డుల్లో సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి కుటుంబ సభ్యులు తెల్లవారకమునుపే వార్డులను పరిశీలిస్తున్నారు. మండల కేంద్రంలోని ఒకటి రెండు వార్డుల్లో నీటి ఎద్దడి ఉన్నట్లు సర్పంచ్ దృష్టికి రావడంతో ఉదయం పూట కుళాయిల ద్వారా వదిలే నీటిని ఎక్కడ వస్తున్నాయి.. ఎక్కడ రావడం లేదనే దానిపై సంతోష్ మేస్త్రి వార్డులను సందర్శించి పరిశీలించారు. సర్పంచ్ కుటుంబ సభ్యుని పరిశీలనలో ఆయా వార్డుల వార్డు సభ్యులు పంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
- Advertisement -



