నవతెలంగాణ – జుక్కల్
జిల్లా స్థాయి మాదిరిగానే డివిజన్ స్థాయిలో కూడా ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జుక్కల్ ఎమ్మార్వో మారుతి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు వారి సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల అవసరాల దృష్ట్యా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలు అందించాలని డివిజన్ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని జుక్కల్ ఎమ్మార్వో మారుతి తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానిక సంస్థల సమస్యలు తలెత్తకుండా మందస్తుగా సమయం వృధా పోకుండా సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. ఈ సదవకాశాన్ని గ్రామాలలోని ప్రజలు నిర్భయంగా పరిష్కారం కొరకు ఫిర్యాదు చేయాలని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డివిజన్ స్థాయిలో కూడా ప్రజావాణి కొనసాగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



