Saturday, May 9, 2026
E-PAPER
Homeకరీంనగర్ముందస్తు నిర్ధారణ పరీక్షలతోనే క్షయ నివారణ సాధ్యం

ముందస్తు నిర్ధారణ పరీక్షలతోనే క్షయ నివారణ సాధ్యం

- Advertisement -
  • జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్!
    నవతెలంగాణ – రాయికల్
    ముందస్తు నిర్ధారణ పరీక్షల ద్వారా క్షయ వ్యాధిని నివారించడం సాధ్యమవుతుందని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. శనివారం కుమ్మరిపల్లి గ్రామంలోని ఇటుక బట్టీ,కోళ్ల ఫాంలో పనిచేస్తున్న కార్మికులకు క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకలి లేకపోవడం,నిరంతర దగ్గు, బరువు తగ్గడం,రాత్రివేళ జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం తరఫున ఉచితంగా పరీక్షలు, మందులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఇల్లెందుల శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ కడకుంట్ల భూమయ్య, ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్, ఆశా కార్యకర్త సుష్మ పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -