నెల్లికుదురు సర్పంచులు కాంగ్రెస్ నేతలు
నవతెలంగాణ-నెల్లికుదురు
మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ తండ్రి భూక్య మంగ్య నాయక్ ఇటీవల అస్వస్థతకు గురై హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సందర్భంగా, నెల్లికుదురు మండల కాంగ్రెస్ సర్పంచులు, మండల నాయకులు వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని శనివారం ఆకాంక్షించారు. అనంతరం సర్పంచులు మండల నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే డా. మురళి నాయక్ తో నెల్లికుదురు మండల అభివృద్ధి విషయమై సుదీర్ఘంగా చర్చించారు.
మండలంలోని అన్ని గ్రామాలను సమానంగా పరిగణిస్తూ, ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా ప్రత్యేక చొరవ తీసుకుంటానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. గ్రామాల సమస్యలు, అవసరాలపై సర్పంచులతో చర్చించి, పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో నెల్లికుదురు మండల కాంగ్రెస్ సర్పంచులు, నాయకులు, పులి వెంకన్న, అశోక్, అమృ, యాకాంతం, ప్రశాంత్, నాగరాజు, రామ్ సింగ్, ఆనంద్, మధు, వీరన్న, వాసు, సోమన్న, శ్రీనివాస్, భాస్కర్ గార్లు, మాజీ డీసీసీ ఉపాధ్యక్షులు బాలాజీ నాయక్ , యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్ , రాజు యాదవ్ , ఆకుతోట సతీష్ , చీకటి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.



