పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు
నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రజా సేవలో బిజీగా ఉన్నా,ఆదర్శవంతమైన వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్న,తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు-యాదమ్మలకు,వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తుంగతుర్తి పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు.శనివారం హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన వివాహ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. భార్యాభర్తల అపురూప బంధానికి,ఆదర్శ దాంపత్యానికి నిలువెత్తు రూపం నాడు ఆ సీతారామచంద్రులు.. నేడు ఈ సామేలు-యాదమ్మలని అన్నారు.భవిష్యత్ లో ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,ఉన్నత పదవులు సాధించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అన్నారు.అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం పరిశీలకుడిగా నియామకమైన మందుల సూర్యకిరణ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి వెంట మండల కాంగ్రెస్ నాయకులు కొండ పరుశురాం,ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ దంపతులకు( సామేలు-యాదమ్మ) శుభాకాంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



