మండల విద్యాశాఖ అధికారి రాందాస్
నవతెలంగాణ-నెల్లికుదురు
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఈ నెల 11 నుండి 17 వరకు నిర్వహించే ప్రత్యేక విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని మండల విద్యాశాఖ అధికారి ఆంగోత్ రాందాస్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వారోత్సవాల్లో ఈ 11న పునాది దినోత్సవం, వేసవి శిక్షణ తరగతులు, 12న 10వ తరగతి విద్యార్థులకు రిమిడియల్ క్యాంపులు, ఇంటర్ విద్యార్థులకు ముగింపు, 13న సర్పంచ్లకు పాఠశాల విద్యా కార్యక్రమాలపై సమావేశం, 14న ప్రొఫేసర్ బడిబాట, పీటీఎం 15న గ్రంథాలయ దినోత్సవం, 16న కళలు-హస్తకళలు- సాంస్కృతి దినోత్సవం, 17న విద్యా విజయోత్సవం దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రతీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విధగా హాజరవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయుల జీవన్ కుమార్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎంఐఎస్ కో- ఆర్డినేటర్ మస్కరపురి సుధాకర్, సీఆర్పీలు ఏ.బాస్కర్రావు, బీ. వీరస్వామి, బీ.కవిత, జే. కవిత తదితరులు పాల్గొన్నారు.
విద్య వారోత్సవాలను విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



