Wednesday, September 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీజేపీ దాడులు అప్రజాస్వామికం

బీజేపీ దాడులు అప్రజాస్వామికం

- Advertisement -

సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో బీజేపీ రాజకీయ దాడులు, ఘటనలు అప్రజాస్వామికమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ మేరకు శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వైరుధ్యాలను సిద్ధాంతపరంగా ఎదుర్కోవాలే తప్ప, భౌతిక దాడులకు దిగడం సరైంది కాదని హితవు పలికారు.కరీంనగర్‌, హుజూరాబాద్‌లోని బీఆరఎస్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులపై, వాహనాలపై దాడులు చేయడం తగదని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధుల కార్యాలయాలపై దాడులు జరగడం అమానుషమని తెలిపారు. వ్యక్తిగతంగా చౌకబారు విమర్శలు చేసుకోవడం శోచనీయమని పేర్కొన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు సంయమనం పాటిస్తూ రాజకీ యాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ప్రజాస్వామ్య పరిధిలోనే ఉండాలని సూచించారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -