మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో శాంతిభద్రతలు క్ష?ణిెంచాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్ విమర్శిం చారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న నేరాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని రాజకీయ కక్షసాధింపులు, ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం మళ్లించడం వల్లే, ప్రజల భద్రత గాలిలో కలిసిపోయిందన్నారు. హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో రిటైర్డ్ డీజీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి వినరు రంజన్ రారు భార్య అత్యంత దారుణంగా హత్యకు గురి కావడం, అంతకు ముందు కరీంనగర్‌లో పట్టపగలు నగల దుకాణం దోపిడీ, సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై ఒక యువకుడిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిందన్నారు. సామాన్య పౌరుల్లో ఇలాంటి సంఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు.
తాజాగా కేంద్రమంత్రి బండి సంజరు కుమారునిపై ఫోక్సో కేసు నమోదు కావడం ఇందుకు నిదర్శనమన్నారు. వెంటనే దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘నేరాల నివారణ, ప్రజా భద్రతపై దష్టి పెట్టాల్సిన పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం… బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ తీరును విమర్శించే సోషల్ మీడియా గొంతులపై అక్రమ కేసులు బనాయించేందుకు వాడుకుంటోంది’ వారు ఆరోపించారు. శనివారం జడ్చర్ల వెళుతున్న తమపై నిఘా పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. శాంతి భద్రతలను విస్మరిస్తే రాష్ట్రం వెనక్కి పోతుందనే విషయం గమనించాలని సూచించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పరిస్థితులను చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ సురభి వాణి దేవి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



