Sunday, May 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

- Advertisement -

20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి చేరిన 2005-06 ఎస్ ఎస్ సి  బ్యాచ్ స్నేహితులు
నవతెలంగాణ-ఆలేర్ రూరల్ 

గతకాలపు తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, చదువుకున్న పాఠశాల ఆవరణలోనే మరోసారి కలుసుకున్న పూర్వ విద్యార్థుల సందడి ఆదివారం శారాజీపేటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఆలేరు మండలం శారాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2005-2006 ఎస్ ఎస్ సి  బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు “మళ్లీ బడికి పోదాం – 2026” నినాదంతో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి చేరిన స్నేహితులు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగాలకు లోనయ్యారు.కార్యక్రమానికి అప్పటి ఉపాధ్యాయులు పోరెడ్డి రంగయ్య, ఉమాదేవి,ప్రభాకర్ రెడ్డి,కిష్టయ్య,నాగేందర్, జంగయ్య,సంధ్య రాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ గురువులను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఆశీస్సులు పొందారు.

ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. 20 ఏళ్ల తర్వాత కూడా తమ విద్యార్థులు పాఠశాల పట్ల ప్రేమాభిమానాలు చూపుతూ అందరూ కలిసి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.విద్యార్థుల ఐక్యత,గురువుల పట్ల గౌరవం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని అభినందించారు.ఈ సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు తమ స్కూల్ రోజుల సరదా సంఘటనలను గుర్తుచేసుకుంటూ నవ్వులు పూయించారు.ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడిన వారు కుటుంబ సమేతంగా హాజరై ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణం అంతా స్నేహబంధాల సాక్షిగా సందడిగా మారింది. 2005-2006 ఎస్ ఎస్ సి  బ్యాచ్‌కు చెందిన అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -