Monday, May 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్పోరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య

కార్పోరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య

- Advertisement -

పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనే లక్ష్యం 
కేజీబీవీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన 
ఆదర్శ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం 
ఎమ్మెల్యే సొంత నిధులతో మూడు లక్షలు ఆదర్శ పాఠశాలకు మంజూరు 
ఉపాధ్యా బృందాన్ని అభినందించిన ఎమ్మెల్యే 
నవతెలంగాణ-నెల్లికుదురు

రాష్ట్రంలోనే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యను అందించేందుకు సీఎం కృషి చేస్తున్నాడని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు శంకుస్థాపన కార్యక్రమం, ఆదర్శ పాఠశాలలో సమ్మర్ క్యాంపు కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించి అనంతరం పార్వతమ్మ గూడెంలో మృతిచెందిన కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కేజీబీ విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న లేదా మహిళా విద్యార్థుల కావాల్సిన మౌలిక వసతులు పాఠశాల అభివృద్ధి పనులు పిల్లల కావాల్సిన మెటీరియల్ సంబంధించిన వాటిని ఈరోజు అందించి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. తిరిగి ఉపాధ్యాయ బృందం కృషి చేయాలని తెలిపారు. ఈ పాఠశాలలో మౌలిక వసతులను అన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు దీన్ని సద్విని చేసుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు.

ఆదర్శ పాఠశాలలో సమ్మర్ క్యాంపు ప్రారంభం 
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో పిల్లల విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి సమ్మర్ క్యాంపు నిర్వహించడం పట్ల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సోమవారం సమ్మర్ క్యాంపు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ కు ఆయన అనేక కోట్లాదినిధులు విడుదల చేసి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద పిల్లలు ఉన్నంత విద్యను అభ్యసించిన ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం బిస్కెట్స్ లాంటివి విద్యార్థులకు అందించి పౌష్టికాహారాన్ని విద్యార్థులకు పంపిణీ చేసి ఉన్నట్లయితే వారు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే చదివి వారు సమాజానికి రాబోయే రోజుల్లో ఉపయోగపడతారని తెలిపారు. అంతేకాకుండా ఉన్నంత స్థాయికి వెళ్ళడానికి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంతగానో విద్యను బోధించి పిల్లలకు అన్ని రకాల వసతులను కల్పిస్తున్నారని అన్నారు.  తల్లిదండ్రులకు పాఠాలు బోధించిన పురుగులకు పేరు ప్రఖ్యాతలు రావాలంటే విద్యార్థులు కష్టపడి చదవాలని అన్నారు.

ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం వారి కావలసిన వస్తువులపై రేట్లు కూడా పెంచి వారికి ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి జిల్లాకు ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇచ్చాడని అది నెల్లికుదురు మండలంలోని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. విద్యార్థులు ఎండాకాలంలో ఈతలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దని అన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. ఈ పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు . ఈ ఆదర్శ పాఠశాలలో రాష్ట్రస్థాయికి విద్యార్థులు ఎంపిక అవడం ఉన్నత స్థాయికి విద్యకి ఐదుగురు విద్యార్థులు ఎంపిక అవడం ఈ పాఠశాలకు గర్వకారణం అని అన్నారు.   ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులి వెంకన్న డీఈఓ సత్యనారాయణ ఎంఈఓ రాందాస్ కేజీబీవీ సుమలత ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్ మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ స్థానిక సర్పంచ్ పులి వెంకన్న వివిధ గ్రామాల సర్పంచులు వీరన్న అశోక్ హేమలత శ్రీనివాస్ కరుణ శ్రీనివాస్ ధనమా అమృనాయక్ నాయకులు మద్ది రాజేష్ హెచ్ అలివేలు హెచ్ రవి ఎమ్మారై రామకృష్ణ జిల్లా మండల నాయకులు ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

పరామర్శ 
మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన సొంటి రెడ్డి నరేష్ రెడ్డి మృతిచెందగా కుటుంబాన్ని సందర్శించి పరామర్శించినట్లు ఎమ్మెల్యే మురళి నాయక్ తెలిపారు. ఆయన మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల గ్రామ నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -