Monday, May 11, 2026
E-PAPER
HomeNews అక్రమ మట్టి వ్యాపారం.. ప్రజావాణిలో ఫిర్యాదు

 అక్రమ మట్టి వ్యాపారం.. ప్రజావాణిలో ఫిర్యాదు

- Advertisement -

 ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదు
నవతెలంగాణ-అచ్చంపేట
లింగాల మండలం రాయవరం గ్రామంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గ్రామ సర్పంచ్ తమ పట్టా భూమి సర్వే నెంబర్ 115, 116లలో గల పట్టా భూమిలో ఉపాధి హామీ పథకం కింద దౌర్జన్యంగా మట్టిని తవ్వి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై బాధిత రైతులు సలేశ్వరం, భాగ్యమ్మ, అలివేల, సరోజమ్మ ,గాలేమ్మ లు సోమవారం అచ్చంపేట ఆర్డిఓ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వ్యాపారులు గ్రామ సర్పంచ్ మట్టిని తవ్వి వ్యాపారం చేస్తున్నారని ఫిర్యాదుల పేర్కొన్నారు.  అధికారులు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పట్టా భూములోకి రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -