Monday, May 11, 2026
E-PAPER
Homeఖమ్మంవిజయవంతంగా సాగుతున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

విజయవంతంగా సాగుతున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట 
అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ఊట్లపల్లి లో సోమవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.  వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె. హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఐ.వి. శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ డి. స్రవంతి రైతులకు పలు వ్యవసాయ సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మ( బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకపల్లి వీరభద్రరావు మాట్లాడుతూ రైతులు భూసార పరీక్షలు చేయించుకొని అవసరానికి అనుగుణంగా మాత్రమే యూరియా, రసాయన ఎరువులను వినియోగించాలని సూచించారు. అధిక రసాయనాల వినియోగం తగ్గించడం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు నీరు, నేల కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని తెలిపారు.

వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఐ.వి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆయిల్ పామ్, మామిడి పంటల్లో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులు, సేంద్రియ వ్యవసాయ విధానాలపై రైతులకు వివరించారు. మల్చింగ్ విధానాన్ని అవలంబించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. డాక్టర్ డి. స్రవంతి మాట్లాడుతూ పంట మార్పిడి వల్ల భూసారం పెరగడమే కాకుండా చీడపీడల సమస్య తగ్గి రైతులకు సుస్థిర ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. అధిక గిరాకీ ఉన్న వంగడాలను సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని సూచించారు.

వ్యవసాయ శాఖ ఏడీఏ పి. రవికుమార్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయంలో ఆరు ముఖ్య అంశాలను క్రమం తప్పకుండా పాటించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అనుసరించడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీకుమారి, వ్యవసాయ విస్తరణాధికారులు సతీష్, షకీరాబాను, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ బాబ్జి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషెంధర్ రెడ్డి, ఉపాధ్యాయులు ఫణి కుమారి, స్రవంతి, హేమ, విద్యార్థులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -