Monday, May 11, 2026
E-PAPER
Homeఖమ్మంబస్ సర్వీస్‌ల విస్తరణతో ప్రజారవాణాకు ఊతం

బస్ సర్వీస్‌ల విస్తరణతో ప్రజారవాణాకు ఊతం

- Advertisement -

– నియోజకవర్గంలో మెరుగుపడుతున్న ప్రజారవాణా
– కొత్తగూడెం డిపో నుంచి అశ్వారావుపేటకు మరో బస్ సర్వీస్
– ప్రారంభించనున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
– ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ అధికారులు
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్ సర్వీస్‌లు విస్తరించడంతో ప్రజారవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో బస్సుల అవసరం పెరగగా, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేక చొరవతో మారుమూల గ్రామాలకు కూడా బస్ సర్వీస్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. రాజకీయ పరిపాలనా పరంగా అశ్వారావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉండగా, ఆర్టీసీ సేవల పరంగా సత్తుపల్లి డిపో పరిధిలో ఉండటం వల్ల కొత్త సర్వీస్‌ల నిర్వహణలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని అధికారులు గతంలో పేర్కొనేవారు. అయితే ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అసెంబ్లీలో తన తొలి ప్రసంగంలోనే అటవీ ప్రాంతమైన కావడిగుండ్లకు బస్ సర్వీస్ కల్పించాలని రవాణాశాఖ మంత్రిని కోరడం విశేషం.

దీంతో సత్తుపల్లి డిపో నుంచి కావడిగుండ్ల, వెలేరుపాడు మండలాలకు రెండు కొత్త బస్ సర్వీస్‌లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కొత్తగూడెం నుంచి పాల్వంచ, ములకలపల్లి, మందలపల్లి మీదుగా అశ్వారావుపేటకు నాలుగు బస్సులు ఎనిమిది సర్వీస్‌లు నడుస్తున్నాయి.

ఇప్పుడు మరో కొత్త బస్ సర్వీస్‌ను మంగళవారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించనున్నారని కొత్తగూడెం డిపో మేనేజర్ సోమవారం తెలిపారు. ఈ సర్వీస్ కొత్తగూడెం–పాల్వంచ–ములకలపల్లి–తిరుమలకుంట–వినాయకపురం మార్గం మీదుగా అశ్వారావుపేట చేరుకుంటుందని వెల్లడించారు. కొత్త సర్వీస్ ప్రారంభంతో అశ్వారావుపేట నుంచి జిల్లా కేంద్రం కొత్తగూడెంకు ప్రజల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -