మిగతా శాఖలకు పట్టింపు లేదా..
నవతెలంగాణ-మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం తహశీల్దార్ ఎండి ముజీబ్ అధ్యక్షతన ప్రజావాణి జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రాణి, ఏపీఎం జగదీష్ కుమార్, ఏపీవోపద్మ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అధికారులు మాత్రమే హాజరయ్యారు. మిగతా శాఖాధికారులు ఎందుకు హాజరు కావడ లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ప్రజావాణికి అధికారుల డుమ్మా షరా మామూలే అన్నట్టు ఉండేది. ఇప్పటికీ ఏం తేడా లేదని, అధికారుల తీరులో మార్పు రావాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులందరూ ఉంటేనే మా సమస్యలు పరిష్కారమవుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల గైర్హాజరును అరికట్టి ప్రజా వినతులను పరిష్కరించాలని వారు కోరారు.
ప్రజావాణిలో పాల్గొనేది ఆ ఐదు శాఖలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



