మీర్పూర్ (బంగ్లాదేశ్) : పాకిస్తాన్, బంగ్లాదేశ్ తొలి టెస్టు డ్రా దిశగా సాగుతోంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై వికెట్ల కోసం బౌలర్లు చెమటోడ్చుతున్నారు. వర్షం, తడి పిచ్, వెలుతురు లేమితో నాల్గో రోజు ఆటలో 50 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. 50.3 ఓవర్లలో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 152/3తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి 179 పరుగుల ముందంజలో కొనసాగుతుంది. మహ్మదుల్ హసన్ జాయ్ (5), షాద్మాన్ ఇస్లామ్ (10) త్వరగా అవుటైనా.. మోమినుల్ హాక్ (56, 120 బంతుల్లో 4 ఫోర్లు), నజ్ముల్ హొస్సేన్ శాంటో (58 నాటౌట్, 105 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీలతో రాణించారు. నాల్గో రోజు ఆటముగిసేసరికి ముష్ఫీకర్ రహీమ్ (16 నాటౌట్)తో కలిసి శాంటో అజేయంగా క్రీజులో నిలిచాడు. తొలి టెస్టులో ఆఖరు రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో లంచ్ సెషన్‌కే ఇరు జట్లు డ్రాకు అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగులు చేయగా, పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులు చేసింది.
డ్రా దిశగా తొలి టెస్టు
- Advertisement -
- Advertisement -



