Tuesday, May 12, 2026
E-PAPER
Homeమానవిడీహైడ్రేషన్‌ నుంచి ఇలా….

డీహైడ్రేషన్‌ నుంచి ఇలా….

- Advertisement -

వేసవిలో విపరీతమైన ఎండల వల్ల చెమటలు పట్టడం డీహైడ్రేషన్‌కి గురవ్వడం జరుగుతుంటుంది. రోజుకి ఎన్ని నీటిని తాగినా సరే నోరు ఎండిపోతుంది. చల్లని నీరు లేదా, కొబ్బరి నీళ్లు ఇలా రకరకాలుగా పానీయాలు తీసుకున్నా సరే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంలో నీటిలో చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదని, ముఖ్యంగా డీహైడ్రేషన్‌కి గురయ్యే ప్రమాదం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. వేసవిలో విపరీతంగా చెమట పడుతుంది. దీంతో చెమట రూపంలో సోడియం మాత్రమే కాకుండా ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతాము. అందుకే నీటిలో ఉప్పును కలిపి తాగితే తిరిగి శరీరానికి సోడియం అందుతుంది. తద్వారా డీహైడ్రేషన్‌ నుంచి కూడా తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.ఉప్పు నీటిని అందరూ తీసుకోకూడదు. రక్తపోటు అధికంగా ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఉప్పునీటిని తీసుకోబోయే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. మూత్రపిండాల పనితీరు సాధారణంగా ఉన్న వ్యక్తులు కూడా ఉప్పునీటిని తీసుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -