Wednesday, May 13, 2026
E-PAPER
Homeజాతీయంఎయిర్ ఇండియా..అంతర్జాతీయ సర్వీసులు త‌గ్గింపు

ఎయిర్ ఇండియా..అంతర్జాతీయ సర్వీసులు త‌గ్గింపు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇంధన ధరల పెరుగుదల, గగనతల ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మొత్తం ఆరు ప్రధాన అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటన జారీ చేసింది. ఢిల్లీ-చికాగో, ముంబై-న్యూయార్క్, ఢిల్లీ-షాంఘై, చెన్నై-సింగపూర్, ముంబై-ఢాకా, ఢిల్లీ-మాలే రూట్లలో సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో అమలులో ఉంటుందని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -