Wednesday, May 13, 2026
E-PAPER
Homeఆటలునెయ్ మార్, మెస్సీలకు చోటు

నెయ్ మార్, మెస్సీలకు చోటు

- Advertisement -

52మందితో ప్రాథమిక జట్లను
 ప్రకటించిన బ్రెజిల్,అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ 2026
రోమ్: ఫిఫా ప్రపంచకప్ 2026కు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా,మాజీ ఛాంపియన్ బ్రెజిల్ జట్లు ప్రాథమిక జట్ల ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి.ఈ రెండు జట్లు 52మంది ఆటగాళ్లను ఫిఫా ప్రపంచకప్ కోసం ఎంపిక చేశాయి. ఈ ఆటగాళ్ల లో 18మందితో షార్ట్ లిస్ట్ ను టోర్నీ ప్రారంభం నాటికి ప్రకటించాల్సి ఉంది.బ్రెజిల్ తరఫున అత్యదిక గోల్స్ కొట్టి,గత మూడేళ్లుగా గాయాలతో ఇబ్బంది పడుతున్న నెయ్ మార్ ను ఎంపిక చేశారు.కోచ్ కార్లో అన్సెలొట్టి మాట్లాడుతూ.. 34ఏళ్ల నెయ్ మార్ పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాడని,అందుకే2026ఫిఫా ప్రపంచకప్ కోసం ప్రకటించిన ప్రాథమిక జట్టులో ఎంపిక చేసినట్లు తెలిపారు. 2023లో ఫామ్ లేమి,గాయాల సమస్య కారణంగా నెయ్ మార్ జాతీయ జట్టు తరఫున ఆడలేదు.గత మూడు ఫిఫా ప్రపంచకప్ లలో ఆడిన అనుభవం నెయ్ మార్ సొంతం.గ్రూప్-సిలో బ్రెజిల్ తో పాటు మొరాకో,హైతీ,స్కాట్లాండ్,అట్లాస్ లయన్ జట్లు ఉన్నాయి.జూన్16న జరిగే తొలి జరిగే తొలి గ్రూప్ లీగ్ మ్యాచ్ లో బ్రెజిల్ జట్టు అట్లాస్ లయన్ తో తలపడనుంది.
ఇక డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా కూడా తమ ప్రాథమిక జట్టు ఆటగాళ్ల జాబితాను వెల్లడించింది. 2022 ఖతార్ ఫిఫా ప్రపంచకప్ ఛాంపియన్ అర్జెంటీనా..జట్టు స్టార్ రైడర్ లియోనెల్ మెస్సీకి చోటు కల్పించింది. 55మంది ఆటగాళ్లతో అర్జెంటీనా తన ప్రాథమిక జట్టును ప్రకటించింది. 2026 ఫిఫా ప్రపంచకప్ అమెరికా,కెనడా,మెక్సికో వేదికగా జూన్ లో ప్రారంభం కానుంది.గతంలో32జట్ల మధ్య టోర్నీ జరగ్గా..ఈసారి48జట్ల మధ్య ఫిఫా ప్రపంచకప్ టోర్నీ జరగనున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -