Wednesday, May 13, 2026
E-PAPER
Homeఆటలుప్రి క్వార్టర్స్ కు 
సాత్విక్-చిరాగ్ జంట

ప్రి క్వార్టర్స్ కు 
సాత్విక్-చిరాగ్ జంట

- Advertisement -

థాయ్ లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
బ్యాంకాక్ : థాయ్ లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రి క్వార్టర్ ఫైనల్లోకి భారత పురుషుల డబుల్స్ చోటు ప్రవేశించింది.మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో సాత్విక్-చిరాగ్ జంట మూడుసెట్ల హోరాహోరీ పోరులో ఇండోనేషియా జంటను చిత్తుచేసింది.తొలి గేమ్ ను సునాయాసంగా నెగ్గిన భారతజట్టు ద్వయం..రెండో గేమ్ ను పోరాడి ఓటమిపాలైంది.నిర్ణయాత్మక మూడో,చివరి గేమ్ ను సునాయాసంగా చేజిక్కించుకొని మ్యాచ్ ను ముగించారు.హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్ లో సాత్విక్-చిరాగ్ జంట 21-19, 21-23, 21-10తో ఇండోనేషియాకు చెందిన ముహ్ పుట్రా-బగాస్ ములానాను ఓడించారు.ఉత్కంఠభరితంగా సాగిన తొలిరౌండ్ మ్యాచ్ సుమారు64నిమిషాలసేపు సాగింది.ప్రి క్వార్టర్స్ లో భారత జంట మలేషియాకు చెందిన బ్రయాన్-మహమ్మద్ లతో తలపడనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -