Wednesday, May 13, 2026
E-PAPER
Homeజాతీయంకూలిన ప్ర‌యివేట్ శిక్ష‌ణా విమానం

కూలిన ప్ర‌యివేట్ శిక్ష‌ణా విమానం

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: మహారాష్ట్రలోని పూణె జిల్లా బారామతిలో బుధవారం ఉదయం ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన శిక్షణా విమానం కూలిపోయింది. జనవరిలో ఎన్ సి పి నేత అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిన ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన సంగతి తెలిసిందే. బారామతి ఎయిర్ స్ట్రిప్ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గోజుబావి గ్రామ సమీపంలో ఉదయం 8.50గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పూణె సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని, ప్రమాద సమయంలో విమానం నేలను తాకడానికి కొద్ది క్షణాల ముందు, దానిలో కొంత భాగం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిందని అన్నారు. ఈ ప్రమాదం నుండి పైలెట్ సురక్షితంగా బయటపడ్డారని అన్నారు. ఈ విమానం రెడ్ బర్డ్ ప్లైట్ ట్నైనింగ్ అకాడమీకి చెందినది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -