నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధం నెపథ్యంలో పసిడి, వెండి ధరలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. సామాన్యులకు బంగారం కొనుగోలు భారంగా మారింది. ఈక్రమంలోనే కేంద్ర ప్రభుత్వం గోల్డ్ ప్రియులకు భారీ షాకిచ్చింది. విలువైన గోల్డ్, వెండి, ప్లాటినం దిగుమతులపై సుంకాలు పెంచింది. గోల్డ్, సిల్వర్‌లపై ఏకంగా ఆరు నుంచి 15శాతం విధించారు. అయితే ప్లాటినంపై 15.4నుంచి 6.4శాతానికి తగ్గించింది. ఈ తరహా సుంకాలు బంగారం, వెండి డోర్, నాణేలు తదితర వాటికి కూడా వర్తిస్తాయని పేర్కొంది. అంతర్జాతీయ పరిణమాల దృష్ట్యా ఆర్థిక స్థితికి మెరుగుదలకు, కరెంట్ లోటును అదుపులోకి తేవడానికి ఈ తరహా చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
గోల్డ్ దిగుమతులపై మోడీ సర్కార్ కీలక నిర్ణయం
- Advertisement -
- Advertisement -



