- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెట్టింపు ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు ఐపీఎల్ చరిత్రలోనే తమ అతిపెద్ద ఓటమిని చవిచూడగా, మరోవైపు స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు రూ. 12 లక్షల జరిమానా పడింది. అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు నిర్దేశిత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్‌కు ఇది తొలి తప్పిదం కావడంతో కెప్టెన్ కమిన్స్‌కు రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
- Advertisement -



